భారతీయుల ఐక్యతను చాటిచెప్పాలి | Indians To embrace unity | Sakshi
Sakshi News home page

భారతీయుల ఐక్యతను చాటిచెప్పాలి

Published Wed, Sep 14 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

భారతీయుల ఐక్యతను చాటిచెప్పాలి

భారతీయుల ఐక్యతను చాటిచెప్పాలి

కవాడిగూడ: ప్రతి భారతీయుడు దేశ భక్తిని పెంపొందించుకొని, ఐక్యతను చాటుకోవాలని బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్‌ గౌతమ్‌ అన్నారు. మంగళవారం ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌  బాబు జగ్జీవన్‌రావు విగ్రహం నుండి లోయర్‌ట్యాంక్‌ బండ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ నల్లు ఇంద్రాసేనారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు సాంబమూర్తిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దేశంలో కొన్ని దుష్టశక్తులు ప్రజల మధ్య ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వాలు త్యాగాల కుటుంబాలను విస్మరించారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో త్యాగాలు చేసిన కుటుంబాలకు తగిన గౌరవం దక్కుతుందన్నారు.  చిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది వీరులు నిజాం ఆరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి విలువైన జీవితాలను దేశం కోసం త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరహరి, జగన్, అశోక్, బీజేపీ ఎస్సీమోర్చా గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ప్రసాద్,  నాయకులు లింగం, పరిమళ్‌కుమార్, కృష్ణ, నాగేశ్వరరావు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement