
ఎయిర్‌పోర్టులో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్: విశాఖపట్నంకు చెందిన ఓ విద్యార్థిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించకుండాపోయింది. విశాఖలో నేవీ ఆఫీసర్‌గా పనిచేసే అరవింద్ శర్మ కుమార్తె కైరవి(17) హైదరాబాద్‌లో ఇంటర్ చదువుకుంటోంది. ఆమె గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి విమానంలో శంషాబాద్‌కు చేరుకుంది.
కైరవి శంషాబాద్ నుంచి పూణేకు వెళ్లాల్సి ఉంది. అయితే పూణేకు చేరుకోలేదని తెలిసిన ఆమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.