అతడో ‘ఆషిక్’ | "Junud 'terrorist romance | Sakshi
Sakshi News home page

అతడో ‘ఆషిక్’

Published Mon, May 30 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

అతడో ‘ఆషిక్’

అతడో ‘ఆషిక్’

‘జునూద్’ ఉగ్రవాది ప్రేమకథ..
అమ్మాయి కోసం  ప్లాస్టిక్ సర్జరీకి ఆషిఖ్ నిర్ణయం
డబ్బు సంపాదనకు ఆఫ్ఘనిస్థాన్ వెళ్లేందుకు యత్నం
ఆ ప్రయత్నంలోనే ‘ఉగ్ర’బాట..
నగరంలో చిక్కిన నఫీజ్ ఖాన్‌కు అనుచరుడు

 

సిటీబ్యూరో: ‘ఆషిక్’ అంటే ‘ప్రేమికుడు’ అని అర్థం. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ మాడ్యుల్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది ఆషిఖ్ అహ్మద్ కూడా ప్రేమికుడే. ఇతడి జీవితంలోనూ ఓ ప్రేమ కథ ఉంది. ఆ అమ్మాయి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి నల్లమందు పండించాలని యోచిం చాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆన్‌లైన్ ద్వారా ‘జునూద్’కు దగ్గరై ఉగ్రబాట పట్టాడు. హైదరాబాద్‌లో చిక్కిన ఉగ్రవాది నఫీజ్‌ఖాన్‌కు ప్రధాన అనుచరుడిగా మారాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మార్చి 18న ఆషిఖ్‌ను అరెస్టు చేసింది. న్యాయస్థానంలో అతడిచ్చిన వాంగ్మూలంలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

 
‘ముఖం’ మార్చుకోవాలని..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా మజీర్‌పుర ప్రాంతానికి చెందిన ఆషిఖ్ అహ్మద్ 11,12 తరగతులు చదువుతున్న సందర్భంలో మరో వర్గం యువతితో ప్రేమలో పడ్డాడు. తన క్లాస్‌మేట్ నుంచి పోటీ వచ్చినా వెనక్కు తగ్గకుండా ‘పోరాటం’ చేశాడు. ఆమె ప్రేమను జయిస్తున్నానని ఆషిఖ్ భావిస్తున్న తరుణంలో ఊహించని షాక్  తగిలింది. మరో వర్గానికి చెందిన యువకుడితో పెళ్లిని తన కుటుంబం ఒప్పుకోదని, తన వర్గాన్ని, కుటుంబాన్ని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని సదరు యువతి స్పష్టం చేసింది. అయినా ఆ యువతిపై ప్రేమ చంపుకోలేని ఆషిఖ్ తన రూపురేఖలు మార్చుకుని, యువతి వర్గానికే చెందిన యువకుడిగా ఆమె కుటుంబానికి పరిచయం కావాలని భావించాడు. అందుకోసం తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం ఆన్‌లైన్ ద్వారా ‘ఆదాయ మార్గాలను’ అన్వేషించాడు.

 
అఫ్ఘన్‌లో ‘నల్లమందు’ పండించాలని..

ప్లస్ టూ తర్వాత ఆషిఖ్ డిప్లొమో చేయడానికి దుర్గాపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. ఆన్‌లైన్ సెర్చ్ చేస్తుండగా.. ఆఫ్ఘనిస్థాన్‌లో నల్లమందు తయారీకి అవసరమైన పాపీ గింజల్ని విస్తారంగా పండిస్తారని, దాన్ని ద్వారా అక్కడి ఉగ్రవాద సంస్థలు డబ్బు సంపాదిస్తాయని తెలుసుకున్నాడు. తానూ అక్కడకు వెళ్లి నల్లమందు పండించి డబ్బు సంపాదించి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని పథకం వేశాడు. ఆ దేశం వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తూ, సహకరించాల్సిందిగా ఫేస్‌బుక్‌లో పేజీ ఓపెన్ చేశాడు. అలా ఆన్‌లైన్‌లో జిహాదీ భావజాలం ఆకర్షణలో పడ్డాడు. ఈనేపధ్యంలోనే ఫేస్‌బుక్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన నఫీజ్ ఖాన్‌కు పరిచయమయ్యాడు. ఈ ఏడాది జనవరి 22, 23 తేదీల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వరుస దాడులు చేసిన ఎన్‌ఐఏ బృందాలు 14 మందిని అరెస్టు చేశాయి. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నఫీజ్ ఖాన్‌తో పాటు ఒబెదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్ ఉన్న విషయం తెలిసిందే.

 
కీలక సమావేశంలో పాల్గొన్న ఆషిఖ్

అప్పటికే ఐఎస్‌ఐఎస్ భారత విభాగం చీఫ్ ఫషీ ఆర్మర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న నఫీజ్ ఖాన్ అతడి ఆదేశాల మేరకు విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు చూసే ఫైనాన్స్ చీఫ్‌గానూ నఫీజ్ ఖాన్ మారాడు. ‘జునూద్’లోకి రిక్రూట్‌మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముంబైకి చెందిన ‘జునూద్’ మాడ్యుల్ చీఫ్ ముదబ్బీర్‌కు రూ.8 లక్షలు హవాలా రూపంలో అందాయి. వీటిలో రూ.2 లక్షలు ముదబ్బీర్ హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడు. పేలుళ్ల ద్వారా విధ్వంసాలు సృష్టించడంతో పాటు టార్గెట్ చేసుకున్న ప్రముఖుల్నీ కాల్చి చంపడం ద్వారా టై క్రియేట్ చేయడానికి ‘జునూద్’ మాడ్యుల్ సిద్ధమైంది. దీనికోసం తుపాకులు, తూటాలను పశ్చిమ బెంగాల్‌లో ఖరీదు చేయాలని భావించింది. ఆయుధాల కోసం బెంగాల్ వెళ్లిన నఫీజ్ ఖాన్ పలుమార్లు దుర్గాపూర్ వెళ్లి ఆషిఖ్‌ను కలిశాడు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ బెంగాల్ యూనిట్‌కు నేత ృత్వం వహించాల్సిందిగా సూచించాడు. మరికొందరి ఉగ్రవాదులతో కలిసి ఆ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలోనూ నఫీజ్, ఆషిఖ్‌లు పాల్గొన్నారు. ‘జునూద్’ మాడ్యుల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూర్చడం, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు అంగీకరించాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన త ృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం ఉన్నారని, దానికి సంబంధించిన రెక్కీ బాధ్యతల్ని ఆషిఖ్ చేపట్టాడని అధికారులు చెబుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement