హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇస్తామన్న మాట వాస్తవమే అని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక్క ప్రభుత్వం వల్లే సాధ్యం కాదన్నారు. ప్రైవేట్ రంగంలోనూ వెతుకాలి ఆయన ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు సభకు వెల్లడించారు. కొత్తగా ఎంపికైన టీచర్లకు ఏప్రిల్ నాటికి పోస్టింగ్లు ఇస్తామన్నారు. అలాగే నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి. త్వరలో వాటిని నిరుద్యోగులకు చెల్లిస్తామని కె. అచ్చెన్నాయుడు చెప్పారు.