అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం | Kaloji memorable award to writer ammangi venu gopal | Sakshi
Sakshi News home page

అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం

Published Tue, Sep 8 2015 10:55 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం - Sakshi

అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం

హైదరాబాద్ : కాళోజీ స్మారక పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రముఖ రచయిత,  సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్...ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.  తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి  తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సర్కార్ ...కాళోజీ పేరుతో ఈ స్మారక పురస్కారాన్ని అందిజేస్తోంది.

అలాగే కాళోజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం  తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో, హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషా చైతన్య కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, కవితల పోటీలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement