ఆర్ కే లక్ష్మణ్ మృతికి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(93) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు.
అద్భుతమైన సృజనాత్మకతకు సున్నితమైన హాస్యం జోడించి కార్టూస్లు రూపొందించడం ఆర్ కే లక్ష్మణ్ ప్రత్యేకత అని కేసీఆర్ అన్నారు. ఆయన కార్టూన్లు సామాన్యుల మనోభావాలను అద్దం పట్టే విధంగా ఉంటాయని స్మరించుకున్నారు.