టీఆర్‌ఎస్ వొంగి సలాం కొట్టే సంస్కృతిని కొనసాగిస్తోందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు.
టీఆర్‌ఎస్ వొంగి సలాం కొట్టే సంస్కృతిని కొనసాగిస్తోందని బీజేపీ ఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే అధికార టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఎంఐఎం టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా సీఎం పేర్కొనటాన్ని దివాళాకోరుతనంగా అభివర్ణించారు. ఎందుకు ఎంఐఎం మిత్రపక్షమైందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏ నిర్ణయమైనా ఎంఐఎంను అడిగే తీసుకుంటున్నారని, హైదరాబాద్‌ను ఆ పార్టీకి కట్టబెట్టారా అని ప్రశ్నించారు. సీఎం వైఖరి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని దుయ్యబట్టారు. ఎంఐఎం సలహాతోనే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని మూసీలో కలిపారని అన్నారు. వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరిగా పెట్టాలని అంటే ఎంఐఎం మాటలు విని వికారాబాద్‌గా ఉంచారని అన్నారు. అవినీతి రాజ్యం ఏలటానికే అధికారంలో ఉన్న పార్టీలతో ఎంఐఎం స్నేహంగా ఉంటోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.