
'మోదీని టీ సర్కార్ ఆహ్వానించలేదు'
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి బుధవారం హైదరాబాద్లో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణకు రావాలని ఇంత వరకు టీ సర్కార్ ఆహ్వానించలేదని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఎలా శంకుస్థాపన చేస్తారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ని కిషన్రెడ్డి ప్రశ్నించారు.