T bjp president
-
'బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది'
కనీసం 10 ఏళ్లపాటు దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. దేశం నలుమూలలా బీజేపీ ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యే డా.కె.లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని ఆయన ఆరోపించారు. ఎస్సీలు, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శించారు. కానీ త్వరలోనే వారు కూడా బీజేపీకి దగ్గర అవుతారన్నారు. బీజేపీలోనే ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రజా ప్రతినిధులు సంఖ్య అధికంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరడానికి కృషి చేయాలని కార్యకర్తలకు వెంకయ్య పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండే పార్టీనే వాళ్లు ఆదరిస్తారని చెప్పారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నదని దానిని వాడుకోవాలి అని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి... సమర్ధుడు కె. లక్ష్మణ్ బాగా పని చేస్తాడని కితాబు ఇచ్చారు. తెలంగాణ లో అన్ని వర్గాలను కలుపుకోగల నేర్పు లక్ష్మణ్ లో ఉందన్నారు. వార్తల కోసం , కాదు గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరాలి అని వారిని కోరారు. పేద ప్రజలకు ప్రధాని మోదీ ఓ ఆశా జ్యోతి అని అభివర్ణించారు. ప్రత్యర్ధులు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కరపత్రం ప్రతీ ఇంటికి వెళ్ళాలని అన్నారు. దేశం ముందుకెళ్లాలని బీజేపీ కోరుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో నైట్ హాల్ట్ చెయ్యాలని నాయకులు, కార్యకర్తలకు హితువు పలికారు. హైదరాబాద్ వదలండి. గ్రామాల్లోని ప్రజలతో మమేకం అయితే బీజేపీని వాళ్లే ఆదరిస్తారన్నారు. ఉత్తరాఖండ్‌లో మెజారిటీ శాసన సభలో నిరూపించుకోవాలి. 356 ఆర్టికల్ , ఫైనాన్స్ బిల్ పాస్ అవ్వాలి రాజ్యాంగ సంక్షోభం ఉంది కాబట్టే ఆగామన్నారు. అసీంబ్లీ రద్దు కాలేదు, బల నిరూపణ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓటింగ్ కాకముందే తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఓటింగ్ జరగలేదు, జరిగింది అని రెండు మాటలు ఎలా వస్తాయి. హిందూ , ముస్లిం , క్రిస్టియాన్స్ అందరు భారతదేశ ప్రజలే, పౌరులే అని అన్నారు. మోడీ అధికారం లో ఉన్నాడు కాబట్టే రాహుల్ హెచ్‌సీయూకి వచ్చాడు. రోహిత్ వేముల విషయంలో దత్తాత్రేయ తప్పేం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. -
'మోదీని టీ సర్కార్ ఆహ్వానించలేదు'
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణకు రావాలని ఇంత వరకు టీ సర్కార్ ఆహ్వానించలేదని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ఎలా శంకుస్థాపన చేస్తారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. -
'జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి టీఆర్ఎస్ పతనం'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకో లేకపోయామని ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు నిరాశ కలిగించాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. మజ్లిస్ అభ్యర్థిని మేయర్ చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ నాలుగున్నర లక్షల ఓట్లపైగా భారీ ఆధిక్యంతో గెలుపోందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
'తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదు'
వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సాగరహారంలో పాల్గొన్నారా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం వరంగల్‌లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అలాగే సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరు అని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. కేసీఆర్ ఊహాలోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని విమర్శించారు. -
రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతాం
నల్గొండ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో పట్టుపడతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండలో విలేకర్లతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఐదు రోజులు కాకుండా 20 రోజుల పాటు జరిగేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల ఆత్మహత్యలపై అన్ని పార్టీలతో కలసి కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదులు కుటుంబాన్ని నల్లగొండలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. -
తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి
హైదరాబాద్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా జరపాలని కేసీఆర్ సర్కార్‌ను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 17న జరిపితే ముస్లింలు బాధపడతారనడం సిగ్గుచేటు అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ విమోచన పోరాటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని ఎందుకు డిఆండ్ చేశారని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్‌ను ప్రశ్నించారు. -
భువనగిరిలో బీజేపీ వర్క్‌షాప్
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా వ్యాప్త మహసంపర్క్ అభియాన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కిషన్‌రెడ్డి... జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లాలో పార్టీని పటిష్ట పరిచే విధి విధానాలపై వారు చర్చించారు. -
రాహుల్ పర్యటనను రైతులే అడ్డుకుంటారు
మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను రైతులే అడ్డుకుంటారని ఆ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జి.కిషన్‌రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లా పర్యటనపై కిషన్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హయాంలో లేని రైతు ఆత్మహత్యలు... బీజేపీ హయాంలోనే ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. దేశంలో రైతుల దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లో రైతుల ఆత్మహత్యల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే రైతుల్లో భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మెదక్ జిల్లాలో పర్యటించేలా చేయాలని టీపీసీసీ భావించింది. అందుకోసం టీపీసీసీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వచ్చే నెలలో రాహుల్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన తేదీలు కూడా ఖరారైయ్యాయి. దీనిపై కిషన్‌రెడ్డిపై విధంగా స్పందించారు.