
మహబూబాబాద్:/నర్సంపేట: రాష్ట్రంలోనే ఏ మార్పు తీసుకురాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం చేస్తారని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. మంగళవారం మహబూబాబాద్‌లో జరిగిన రైతాంగ, నిరుద్యోగ సదస్సులో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తానని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు.
థర్డ్ ఫ్రంట్ పుట్టకముందే పుట్టినట్లు సంబురాలు జరుపుకోవడం హాస్యాస్పదమన్నారు. రైతాంగ సమస్యలపై ఇంటింటికి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని, త్వరలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని రాజకీయాలన్నీ కమీషన్లు, కాం ట్రాక్ట్‌లు చుట్టే తిరుగుతున్నాయని, ఈ పరిస్థి తిలో మార్పు తీసుకురావాలనే పార్టీని ఏర్పా టు చేస్తున్నట్లు కోదండరాం అన్నారు. ఏప్రిల్‌లో పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment