16న మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన | Laying the foundation for Mega Textile Park on 16th | Sakshi
Sakshi News home page

16న మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన

Published Sat, Aug 12 2017 2:18 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

Laying the foundation for Mega Textile Park on 16th

ఉదయం 11 గంటలకు సీఎం చేతుల మీదుగా..
 
సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ చరిత్ర మార్చే మరో ఘట్టానికి తెరలేవనుంది. స్థానికులకు ఉద్యోగం, నేతన్నకు ఉపాధి హామీనిచ్చే భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల మధ్యలో ఈ పార్కు ఏర్పాటు చేయనున్నారు. రూ.1,150 కోట్ల ఖర్చుతో నిర్మించే ఈ పార్కులో రూ.11,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే అంచనా వేశారు. ఈ పార్కు ద్వారా 1.3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

రాష్ట్రం నుంచి బతుకుదెరువుకు వలస వెళ్లిన చేనేత కార్మికులు తిరిగొచ్చే అవకాశాన్ని ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కు కల్పించనుంది. 2014లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఈ పార్కుకు శంకుస్థాపన ద్వారా నెరవేరబోతోంది. పార్కులో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు తగిన వసతు లు కల్పించి, పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం ఇప్పటికే 1,190 ఎకరాల భూమి సేకరించారు. ఇందుకు ముందుకు వచ్చిన రైతులు, చొరవ తీసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కడియం ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement