
‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’
సాక్షి, హైదరాబాద్: మహాసమ్మేళన్ సభలో ప్రధాని మోదీ ఇస్తున్న సందేశమే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాంది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాసమ్మేళన్ సభ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.