Mahasammelan
-
మోదీ ప్రసంగంతో నూతనోత్తేజం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మహాసమ్మేళన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో రాష్ర్టంలో కార్యకర్తలకు నూతనోత్తేజం కలిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఒకే బీజేపీ ఎంపీ ఉన్నప్పటికీ సమాఖ్య విధాన స్ఫూర్తితో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. ఒకే పర్యటనతో రాష్ట్రానికి రూ.17 వేల కోట్ల అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. ఇది తెలంగాణపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు అని మోదీ చెప్పడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం, విశ్వాసం పెరిగిందని చెప్పారు. 2019లో తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా కేంద్రంలో అవినీతి రహిత పాలన ఉందని మెచ్చుకున్నారని గుర్తుచేశారు. -
దేశమంతా బీజేపీ జెండా: వెంకయ్య
-
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
-
‘2019 ఎన్నికలకు మోదీ సందేశమే నాంది’
సాక్షి, హైదరాబాద్: మహాసమ్మేళన్ సభలో ప్రధాని మోదీ ఇస్తున్న సందేశమే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు నాంది అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాసమ్మేళన్ సభ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. -
దేశమంతా బీజేపీ జెండా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా బీజేపీ జెండా కనబడుతోందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాసమ్మేళన్లో ఆయన ప్రసంగించారు. దేశం మెచ్చిన, ప్రపంచం నచ్చిన ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకుపోతున్నామని చెప్పారు. దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం, మతం, ప్రాంతమంటూ విడదీసి రాజకీయ ప్రయోజనం పొందే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. వేషం, భాష, ప్రాంతం, రాష్ట్రం ఏదైనా మనమంతా భారతీయులమేనని పేర్కొన్నారు. ఐక్యంగా ఉంటూ ఇప్పటిదాకా జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలన్నారు. గతంలో పతాక శీర్షికల్లో కనిపించే అవినీతి, కుంభకోణాల వంటివి మోదీ అధికారంలోకి వచ్చాక వెతికినా కనిపించడం లేదని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ పథకాలను కేంద్రం ప్రవేశపెడుతోందని తెలిపారు. ప్రపంచంలోనే ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం బీజేపీకి ఉందన్నారు. కేంద్రం అమలుచేస్తున్న పథకాలు, అట్టడుగువర్గాలకు అందుతున్న ఫలాలను ఇంటింటికీ తలుపుతట్టి చెప్పాలని బీజేపీ కార్యకర్తలకు వెంకయ్యనాయుడు సూచించారు. -
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
టీఆర్ఎస్ రెండేళ్ల పాలనపై కె.లక్ష్మణ్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే ఎజెండాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన మహాసమ్మేళన్లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. కేసీఆర్ వారసులకు అధికారాన్ని అప్పగించడం కోసం రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. న్యాయస్థానాలు తప్పని చెప్పినా వినకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 119 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 30 శాతం మంది సభ్యులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించినవారేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంసెట్ 1, 2, 3 అంటూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా బాధ్యులైన మంత్రి కూడా రాజీనామా చేయకపోవడమంటే అవినీతిని సమర్థించడమేనని విమర్శించారు. సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారంలోకి వచ్చేదాకా చెప్పిన టీఆర్ఎస్... ఇప్పుడా అంశాన్ని తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ పాలనపై విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.