పలువురు ఎస్పీల బదిలీలు? | Many SP's transfers? | Sakshi
Sakshi News home page

పలువురు ఎస్పీల బదిలీలు?

Published Thu, Sep 7 2017 1:04 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

పలువురు ఎస్పీల బదిలీలు? - Sakshi

పలువురు ఎస్పీల బదిలీలు?

- ఆయా పోస్టులపై భారీగా కసరత్తు
నగర కమిషనరేట్‌లోనూ బదిలీలు.. 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నాలుగు జిల్లాల ఎస్పీలను బదిలీచేసే విషయంలో పోలీస్‌ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా నగర కమిషనరేట్‌ పరిధిలో ఖాళీగా ఉన్న ఈస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ, అదనపు డీసీపీ పోస్టుల విషయంలో అధికారుల ఎంపిక కోసం ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి ఆరు నెలలపాటు ప్రసూ తి సెలవులో వెళ్లిపోయారు. అవినీతి ఆరోపణలెదు ర్కొంటున్న ఓ జిల్లా ఎస్పీని బదిలీపై సీఐడీకి తీసుకువచ్చే ందుకు రంగం సిద్ధం చేశారు. మరో జిల్లా ఎస్పీని నగర కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించే అవకాశా లున్నట్టు తెలుస్తోంది.  

ఆయన స్థానంలో మరో అధికారిని జిల్లా ఎస్పీగా నియమించాల్సి ఉంది.  నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పేరుకూడా బదిలీల జాబితాలోకి చేరిపోయి నట్టు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయ పడ్డారు. ఈ జిల్లాల ఎస్పీల బదిలీలు త్వరలోనే జరుగుతాయని పోలీస్‌ ముఖ్యకార్యాలయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ కమిషనరేట్‌కు గుండె కాయ లాంటి టాస్క్‌ఫోర్స్‌కు డీసీపీ తో పాటు అదనపు డీసీపీ పోస్టు ఖాళీగా ఉన్నాయి.  

డీసీపీగా పనిచేసిన లింబారెడ్డి రిలీవ్‌ కాబోతున్నారు. ఆ పోస్టు కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభిం చారు. సీఎం సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అదనపు ఎస్పీ.. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పోస్టు కోసం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నా యి. ఓ కమిషనరేట్‌లో పనిచేస్తున్న అదనపు డీసీపీ కూడా తనకు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా అవకాశం కల్పించాలని ఉన్నతాధి కారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ ఎస్పీగా మహిళా అధికారిని పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నగర కమిషనరేట్‌లోని ఈస్ట్‌జోన్‌కు నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement