నెల్లూరు-గూడూరు స్టేషన్‌ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో రైళ్ల రద్దు, దారిమళ్లింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు-గూడూరు స్టేషన్‌ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో రైళ్ల రద్దు, దారిమళ్లింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా విజయవాడ-మద్రాస్ మధ్య నడిచే జనశతాబ్ది, పినాకిని, కాకినాడ-బెంగళూర్ శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే 26న(శనివారం) కూడా విజయవాడ-మద్రాస్ జనశతాబ్ది, పినాకిని, ఆదిలాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి.
30న సికింద్రాబాద్-విశాఖ ప్రత్యేక రైళ్లు రద్దు..
ఈ నెల 30, మే 1వ తేదీల్లో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. 30న రాత్రి 11.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, మే ఒకటో తేదీన సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్ రావాల్సిన ైరె ళ్లను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు పేర్కొన్నారు.