
వివాదాస్పదమైన మీర్‌పేట్ పోలీసుల తీరు
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్ పోలీసుల తీరు వివాదాస్పదమైంది. సెల్‌ఫోన్ చోరీ చేశారని లెనిన్‌నగర్‌కు చెందిన అఖిల్(22), అతని స్నేహితుడు శివకుమార్‌ను మీర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో వారంగా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల్... యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీంతో అఖిల్‌ను గుట్టుచప్పుడు కాకుండా గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న అఖిల్ బంధువులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. అఖిల్‌పై కేసులు బనాయించి... చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేకే అఖిల్ ఆత్మహత్యాయత్నం చేశాడని... బంధువులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు.