రాజకీయ ఏకీకరణ కోసమే చేరికలు: కొప్పుల | Mergers for political integration: KOPPULA | Sakshi
Sakshi News home page

రాజకీయ ఏకీకరణ కోసమే చేరికలు: కొప్పుల

Published Mon, Apr 4 2016 4:02 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

రాజకీయ ఏకీకరణ కోసమే చేరికలు: కొప్పుల - Sakshi

రాజకీయ ఏకీకరణ కోసమే చేరికలు: కొప్పుల

సాక్షి, హైదరాబాద్: పేదల అభ్యున్నతి కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని, వీటిని చూసే పలువురు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు క ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఏకీకరణ కోసమే ఈ చేరికలు జరుగుతున్నాయన్నారు. గడిచిన 60 ఏళ్లలో కూడా జరగని అభివృద్ధి కేసీఆర్ విజన్‌తో జరుగుతోందని, ఇక తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీల అవసరమే లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, కేసీఆర్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement