తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు | Uttam fires on cm kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు

Published Tue, Apr 18 2017 2:46 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు - Sakshi

తెలంగాణ కేసీఆర్‌ జాగీరు కాదు

సమైక్య రాష్ట్రంలోనూ ఇలాంటి ఆంక్షలు, నిర్బంధం లేవు: ఉత్తమ్‌
- అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట పీసీసీ సత్యాగ్రహం.. ముఖ్య నేతల అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: ఇష్టారాజ్యంగా పాలించడానికి తెలంగాణ రాష్ట్రం సీఎం కె.చంద్రశేఖర్‌రావు జాగీరు కాదని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ధర్నాచౌక్‌ ఎత్తివేత, రెండు పడగ్గ దుల ఇళ్ల నిర్మాణంలో వైఫల్యం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పనలో నిర్లక్ష్యంపై నిరసనగా సోమవారం హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పీసీసీ సత్యాగ్రహం చేపట్టింది.

పీసీసీ కార్యనిర్వా హక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దానం నాగేం దర్, మర్రి శశిధర్‌రెడ్డి, నేతలు వి.హన్మంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, అంజన్‌ కుమార్‌ యాదవ్, మల్లు రవి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం దగ్గరకు నేతలు చేరుకుని బైఠాయించిన కొద్ది సేపట్లోనే పోలీసులు వారిని అరెస్టు చేసి.. గోషామహల్, నారాయణగూడ, నాంపల్లి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

నియంతృత్వం, నిరంకుశం..
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటుందని ఆశించామని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వం, అరాచకం, నిరంకుశంగా వ్యవహ రిస్తున్నదని ఉత్తమ్‌ విమర్శించారు. పోలీసులు విడుదల చేసిన అనంతరం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, సమైక్య రాష్ట్రం లో లేని ఆంక్షలు, నిర్బంధం తెలంగాణలో కొన సాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ తరలింపుపై సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి లోనే లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పాటు కాగానే లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, ఒకేసారి రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతిని ఇస్తామ న్నారు. వచ్చే ఏడాది నుంచి ఎరువులను ఉచితంగా ఇస్తామని చెప్పడం పచ్చి మోసమని, వచ్చే ఏడాది ఇస్తే ఇప్పటి నుంచే ప్రచారం ఎందుకని ప్రశ్నించారు.  పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, రుణమాఫీ పెద్ద మోసమని, రుణాలపై వడ్డీ ఇప్పటికీ రైతుల మెడపైనే ఉందన్నారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజ ర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎంపీ వి.హన్మంత రావు డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, సీఎం కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందన్నారు. సీఎం కేసీఆర్‌ ను రాళ్లతో కొట్టే సమయం ఆసన్నమైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హెచ్చరించారు. కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలను కుంటున్నారని, హరీశ్‌రావు కేసీఆర్‌పై తిరుగుబాటు చేస్తే తాము మద్దతుగా ఉంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement