కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ఆరంభం | KCR fall of beginning from Warangal | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ఆరంభం

Published Sat, Nov 7 2015 3:02 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ఆరంభం - Sakshi

కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ఆరంభం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 పరకాల: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పతనం వరంగల్ నుంచే ప్రారంభం కావాలని.. దీని కోసం వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయూనికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయూలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పరకాలలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థారుు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన మొత్తం దగా, మోసంతో కూడుకున్నదని దుయ్యబట్టారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అహంకారం వల్లే ప్రస్తుత ఉప ఎన్నికలు వచ్చాయన్నారు.

ఎన్నికలు అంటే ఇష్టపడే కేసీఆర్.. టీడీపీ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో ఎందుకు రాజీనామా చేరుుంచడం లేదని ప్రశ్నించారు. సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ తాను స్థానికుడిని కాదని ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్ మంత్రులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ పుట్టాడో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజలు ఆదరిస్తే ఇక్కడే ఉండి వారికి సేవ చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement