జీహెచ్ఎంసీలో త్వరలోనే ఇన్నోవేషన్ సెల్!
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ అంతర్గత అంశాలపై ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అంతర్గత విషయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిపారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి, రోడ్ల విస్తరణ కోసం జీహెచ్‌ఎంసీలో త్వరలోనే ఇన్నోవేషన్ సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ సెల్‌కు ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని తెలిపారు. ఇంకా మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే...
* యూనిఫైడ్ మెట్రో ట్రాన్స్ పోర్ట్ అథారిటీని మరింత బలోపేతం చేస్తాం.
* హైదరాబాద్ రోడ్ల విషయంలో మార్పులు.
* రోడ్ల అభివృద్ధికి నేషనల్ హైవేస్.. ఆర్ అండ్ బీఈఎన్సీ.. జీహెచ్ఎంసీసీఈలతో ప్రత్యేక కమిటీ.
* స్టాండర్డ్ రేట్ ప్రకారం బలమైన కంపెనీకి పనులు ఇస్తాం. వారికి దశల వారీగా చెలింపులు చేస్తాం.
* 221 ట్రాఫిక్ జంక్షన్ లపై పోలీస్ యంత్రాంగంతో వచ్చేవారం సమావేశం.
* త్వరలో చీఫ్ ఇంఫర్మేషన్ ఆఫీసర్ నియామకం.
* పార్కింగ్ కాంప్లెక్స్ లు ప్రజలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు
* వీటి ద్వారా వారికి ఆదాయం కూడా అందుతుంది. ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంది.
* త్వరలో ఆస్థిపన్ను పెంచే అవకాశం.
* ఆగష్టు 15 నాటికి 15 ఏళ్లు దాటిన పాత జీహెచ్ఎంసీ వాహనాలు తొలగించి.. అదేరోజున కొత్తవాటిని అందజేస్తాం.
* ఇవన్నీ సాకారం అవడానికి త్వరలో సిబ్బంది నియామకం.