బస్ షెల్టర్ల నిర్వహణ సక్రమంగా లేదు: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో బస్సు షెల్టర్ల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు. హైదరాబాద్‌లో మొత్తం 1183 బస్ షెల్టర్లు ఉండగా 430 బస్ షెల్టర్ల ఆధునీకరణకు టెండర్లు పిలిచామని వివరించారు. ఈసారి బడ్జెట్లో జీహెచ్‌ఎంసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రవాణా వ్యవస్థను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకునే ఆలోచన చేస్తామన్నారు.
ప్రజల జీవన ప్రమాణాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు.. కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో వర్షాలు తక్కువగా కురయడం వల్ల ఈ ఏడాది కూడా నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించామన్నారు. జడ్చర్లకు రూ.2.40 లక్షలు, కల్వకుర్తికి రూ. 6.70 లక్షలు, షాద్‌నగర్‌కు రూ. 6.90 లక్షలు కేటాయించామన్నారు.