
నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన సందర్భంగా ఇళ్లలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు
టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన సందర్భంగా ఇళ్లలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం అత్యంత అప్రజాస్వామికమని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అరెస్టయిన వారిలో ఉగ్రవాదులు, టైస్టులు లేరని.. సీఎం పర్యటన సాకుతో తెల్లవారుజామున 5 గంటలకు టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సీఎం పర్యటన పేరుతో పోలీసులు ఆలేరు పట్టణంలో షాపులు బంద్ చేయించడం, కనబడిన వారిపై చేయి చేసుకోవడం చూస్తుంటే టీఆర్‌ఎస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. ఈ పరిస్థితిని ఖండిస్తున్నామని, పండగ రోజున ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షాల నోరు నొక్కడమే పరిపాలన అని కేసీఆర్ అండ్ కో భావిస్తే.. రాబోయే రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.