
పాతబస్తీకి ఏసీ బస్సులు నడపాలి: అసదుద్దీన్
హైదరాబాద్: హైదరాబాద్ పాత బస్తీకి ఏసీ బస్సులను నడపాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. పాతబస్తీలోని చార్మినార్, మక్కామసీదు, ఖిల్వత్, చౌ మొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు , మదీనా, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో అనేక చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారని గుర్తు చేశారు. స్ధానికులతో పాటు పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. రాబోవు వేసవిని దృష్టిలో పెట్టుకొని ఏసీ బస్సులను నడపాలని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు.