
కొత్త ఐటీఐలకు అనుమతులు లేవు
ముషీరాబాద్: భవిష్యత్‌లో కొత్త ఐటీఐలకు అనుమతులు ఇవ్వబోమని, ఉన్నవాటిని బలోపేతం చేస్తామని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ముషీరాబాద్ ఐటీఐ కళాశాలలో ఫోర్డ్ ఇండియా కంపెనీ ఆటోమోటివ్ విద్యార్థులకు పర్వీద్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఫోర్డ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రభులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఈ ఏడాది 250మంది ఐటీఐ విద్యార్థులను దుబాయ్ పంపించామని, వచ్చే ఏడాది 500, ఆపై సంవత్సరం వెయ్యి మందిని దుబాయ్ పంపేందుకు ఒప్పదం చేసుకున్నట్లు తెలిపారు.
మల్లేపల్లి ఐటీఐని దేశంలోనే ఉత్తమ ఐటిఐగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫోర్డ్ ఇండియా ఉపాధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పర్విన్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ స్వర్ణలత ఫోర్డ్ ఇండియా ప్రతినిధుల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలోముఠా గోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, నగేష్, దేవరాజన్, కె.వై.నాయక్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.