
రాత్రి మరో గంట కోత.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో విద్యుత్ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది.అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం నుంచి రోజూ రాత్రిపూట గంట పాటు సరఫరా నిలిపివేయాలని డిస్కం సూచించింది. ఈ మేరకు ఆయా సబ్‌స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటల చొప్పున నాలుగు గంటల పాటు కోతలు అమలు చేస్తున్న డిస్కం తాజాగా రాత్రిపూట కూడా కరెంట్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించడంతో కోత వేళలు అధికారికంగా ఐదు గంటల పాటు అమలవుతున్నాయి. ఇక, అనధికారికంగా ఇంకా ఎక్కువ సమయమే కోతలు విధిస్తున్నారు. ఈ పరిణామాలు నగరవాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి.