డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ తేలేంత వరకు కేడర్ విభజన చేయవద్దని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ తేలేంత వరకు కేడర్ విభజన చేయవద్దని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వుచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దా ఖలు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
కేడర్ విభజనకు పరిపాలన ట్రిబ్యునల్ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియారిటీ ఖరారు చేయకుండానే కేడర్ విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయ న కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.