న్యాయాధికారుల సెలవులకు సంబంధించి జిల్లా జడ్జీలు, మెట్రోపాలిటన్ జడ్జీల అధికారాలను బుధవారం హైకోర్టు ఉపసంహరించింది.
హైదరాబాద్: న్యాయాధికారుల సెలవులకు సంబంధించి జిల్లా జడ్జీలు, మెట్రోపాలిటన్ జడ్జీల అధికారాలను బుధవారం హైకోర్టు ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు అనుమతి తీసుకోకుండా ఏ న్యాయాధికారి సెలవు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా సెలవు కోరితే ఆ న్యాయాధికారుల సెలవు దరఖాస్తులు కోర్టుకు మెయిల్ చేయాలని రెండు రాష్ట్రాల న్యాయాధికారులను హైకోర్టు ఆదేశించింది.