అలనాటి చిత్రం
భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రముఖ ఆర్టిస్ట్ కొండపల్లి శేషగిరిరావు పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోచుకుంది. ప్రతి చిత్రం వర్ణరంజితమై ఆకట్టుకుంది. రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో మంగళవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలోని పెయింటింగ్స్‌ను మంత్రి చందూలాల్ ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శేషగిరిరావు పేరిట నగరంలో చిత్రకళా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తాం. కాపు రాజయ్య, శేషగిరిరావు, పీటీ రెడ్డిల పేరు మీద ఏటా ఉత్తమ చిత్రకారులకు రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తాం. అలాగే కొండపల్లి జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది’ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, భాషాసాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఎం.హరికృష్ణ తదితరులు శేషగిరిరావు ప్రతిభను కీర్తించారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీప్లస్