10 నుంచి ప్యాకేజి రేట్ల నిర్ణయంపై సమావేశాలు
మేనేజింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు వెల్లడి
హైదరాబాద్: హెల్త్‌కార్డుల అమలుకు సంబంధి పలు విషయాలను చర్చించిన అంశాలను ప్రభుత్వానికి ప్రతిపాదనల రూపంలో అందించనున్నామని మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు ఐ.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌టీఆర్ వైద్యసేవ సీఈవో డా. ఎ. రవిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రతిపాదించామన్నారు. ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లకు, గురుకులాలు, ప్రభుత్వరంగ, గ్రంధాలయ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. హెల్త్‌కార్డులున్న అందరికీ మాస్టర్ హెల్త్‌చెకప్ అన్ని ప్రైవేట్ నెట్‌వర్కు ఆసుపత్రులలో అనుమతించడంతో పాటు భార్య,భర్త, పెన్షనర్లకు వర్తింపచేయాలి.
40 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి ఒక సారి మాస్టర్ హెల్త్‌చెకప్,క్రానిక్ వ్యాధులకు ప్రైవేట్ నెట్‌వర్కు 382 ఆసుపత్రులన్నింటిలో వైద్యం అందించాలి. 1885 ప్రోసీజర్స్ కాకుండా అన్ని వ్యాధులకు హెల్త్‌కార్డులపై వైద్యం చేయాలి. హెల్త్ కార్డులు అమలుచేయని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంతాన సాఫల్యానికి హెల్త్‌కార్డు ద్వారా అందించాలని, ఇక మీదట మెడికల్ బిల్లులు డీడీఓల ద్వారా రప్పించుకొని ఎన్‌టీఆర్ వైద్యసేవ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ప్యాకేజి రేట్లు నిర్ణయించేందుకు ఈ నెల 10,11,12 తేదీలలో నెట్‌వర్కు ఆసుపత్రుల యాజమాన్యం, ఎన్‌టీఆర్ వైద్యసేవ డాక్టర్లు సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మేనేజింగ్ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించిన్నట్లు చెప్పారు.
హెల్త్ కార్డుల అమలులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
Published Sun, Aug 7 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement