పాకిస్తాన్ ఖైదీ విడుదల.. మళ్లీ జైలుకు
సిట్ పోలీసులు తరలిస్తుండగా... వరంగల్‌లోనే ఉంచాలని జీవో
పోచమ్మమైదాన్: పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ అర్షద్ మంగళవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. అరుుతే, పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అర్షద్‌ను తిరిగి అదే జైలులో ఉంచాలని లీగల్ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి సంతోష్‌రె డ్డి ప్రత్యేక జీవో విడుదల చేశారు. దీంతో అర్షద్‌ను మళ్లీ జైలుకే తరలించారు.
పాకిస్తాన్‌లోని రహమయారన్ జిల్లా ఖన్‌పూర్‌కు చెందిన మహ్మద్ అర్షద్ మహమూద్ దొంగతనంగా మన దేశంలోకి చొరబడి ఇక్కడి సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తూ 2004లో అబిడ్స్ పోలీసులకు పట్టుపడ్డాడు. 2009 ఏప్రిల్ 30న అర్షద్‌కు 14 సంవత్సరాల శిక్ష విధిస్తూ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. దీంతో అతడిని చర్లపల్లి జైలులో ఉంచారు. అక్కడ ఇతర ఖైదీలతో గొడవ పడడంతో 2011లో విశాఖపట్నం జైలుకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర విభజన కావడంతో తిరిగి 2014 జూన్ 7న వరంగల్ జైలుకు తీసుకొచ్చారు.
అప్పటి నుంచి ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, జైలు నిబంధనల ప్రకారం మంగళవారం నాటికి అతడి శిక్షా కాలం పూర్తవడంతో విడుదల చేశారు. రెండు నెలల క్రితమే ఈ విషయూన్ని పాక్ ప్రభుత్వానికి మన అధికారులు సమాచారం అందించినా, వారి నుంచి స్పందన లేకపోవడం గమనార్హం విడుదల అయిన తరువాత అర్షద్ మాట్లాడుతూ ‘ఐ లైక్ ఇండియా.. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు’ అంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ వాహనం ఎక్కాడు.