చిక్కడపల్లి సమీపంలో రైల్లోని ఓ ప్రయాణికుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
హైదరాబాద్: హైదరాబాద్ ఎమ్ఎమ్టీఎస్ రైల్లో దుండగులు బీభత్సం సృష్టించారు. చిక్కడపల్లి సమీపంలో రైల్లోని ఓ ప్రయాణికుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని వద్ద పది వేల రూపాయిల నగదును దోచుకున్నారు.
కదులుతున్న రైలు నుంచి దుండగులు ఆ ప్రయాణికుడిని బయటకు తోసివేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.