వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు.
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించిన పసునూరికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. పసునూరితో పాటు పలువురు మంత్రులు కేసీఆర్ ను కలిశారు. కాగా పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన లోక్‌సభ సభ్యుడిగా ఆయన రికార్డు నమోదు చేశారు.