వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందడంపై లండన్ ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందడంపై లండన్ ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచిపెట్టి, టపాసులు కాల్చారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులే దయాకర్‌ను గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రత్నాకర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.