
దయాకర్ ఎన్నికల ఖర్చు పార్టీదే: కేసీఆర్
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి పసునూరి దయాకర్‌కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దయాకర్ డబ్బులేని వ్యక్తి అని, పార్టీయే అతని ఎన్నికల ఖర్చును భరిస్తుందని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేశామన్నారు.
ఇకపై తెలంగాణలో కరెంట్ కోతలుండవని, వచ్చే ఏడాది నుంచి కాలేజ్ హాస్టళ్లలో కూడా సన్నబియ్యంతో భోజనం ఉంటుదన్నారు. వచ్చే ఏడాది నుంచి బీపీఎల్ ఫ్యామిలీలందరికీ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.