ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం
హైదరాబాద్: ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక అల్వాల్‌కు చెందిన కృష్ణ అనే రోగి మృతిచెందాడు. కాగా, ఆక్సిజన్ పెట్టాలంటే రూ.150, మందులు ఇవ్వాలంటే రూ.300 లంచం.. ఇలా చికిత్స కోసం వచ్చిన రోగుల వద్ద డబ్బుల కోసం వార్డు బాయ్ వేధిస్తున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందువల్లనే సరైన చికిత్స అందక కృష్ణ మృతి చెందాడంటూ అతని బంధువులు మృతదేహంతో ఆస్పత్రిలో ధర్నా చేస్తున్నారు.