మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడి | pdsu rally at ministers quarters | Sakshi
Sakshi News home page

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడి

Published Mon, Mar 27 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

pdsu rally at ministers quarters

హైదరాబాద్‌: ఫీజుల నియంత్రణను అమలు చేయాలని కోరుతూ.. పీడీఎస్‌యూ కార్యకర్తలు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం పీడీఎస్‌యూ కార్యకర్తలు పెద్ద ఎత్తున మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌తో పాటు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకొని గోషామహల్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement