ministers quarters
-
మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏల ప్రయత్నం
బంజారాహిల్స్ (హైదరాబాద్): తమ సమస్యలపై సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సోమవారం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 60 మంది వీఆర్ఏలు సమస్యలపై గళమెత్తేందుకు మంత్రుల క్వార్టర్స్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకొని గేటు దూకేందుకు యత్నించిన పలువురు వీఆర్ఏలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా ఉభయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు దాదేమియా, వెంకటేష్, నర్సింహ్మ, హరినాథ్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం హామీ ప్రకారం పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి
హైదరాబాద్: ఫీజుల నియంత్రణను అమలు చేయాలని కోరుతూ.. పీడీఎస్‌యూ కార్యకర్తలు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం పీడీఎస్‌యూ కార్యకర్తలు పెద్ద ఎత్తున మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌తో పాటు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకొని గోషామహల్‌కు తరలించారు. -
మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించిన బీజేవైఎం
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. -
మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బతుకమ్మ సంబరాలు
-
మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
-
మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ... మంత్రులు కడియం, లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మంత్రుల క్వార్టర్లలో పాములు
-
మంత్రుల క్వార్టర్లలో పాములు
బంజారాహిల్స్ (హైదరాబాద్): హైదరాబాద్‌లోని మంత్రుల అధికారిక నివాసాల సముదాయంలో పలు విషపూరితమైన పాములు సంచరిస్తుండటంతో శనివారం పాముల వేట ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌కు.. నెహ్రూ జూలాజికల్ పార్కులో పనిచేసే పాములు పట్టేవారిని రప్పించారు. క్వార్టర్లలోని చెట్ల పొదలు, కంప చెట్లు, ఎవరూ నివాసం ఉండని భవనాల్లో గాలించి మధ్యాహ్నం వరకు వారు రక్తపింజర, జెర్రి గొడ్డు, కట్ల పాము లాంటి వాటిని పట్టుకున్నారు. నాగుపాము, నల్లత్రాచులాంటివి కూడా సంచరిస్తున్నాయని అక్కడి సిబ్బంది చెబుతుండటంతో వాటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
తెలంగాణ మంత్రుల క్వార్టర్లు ఇవే
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రుల్లో కొందరికి బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మంత్రులకు ఈ నివాస సముదాయంలోని 1 నుంచి 15వ నంబర్ క్వార్టర్ వరకు విభజన సమయంలో కేటాయించిన సంగతి విదితమే. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మంత్రి ఈటెల రాజేందర్‌కు క్వార్టర్ నంబర్ 12, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఐదు, విద్యాశాఖమంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డికి 15వ నంబర్, నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావుకు ఏడో నంబర్ క్వార్టర్‌ను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సలహాదారులకు శాఖల కేటాయింపు... ప్రభుత్వం నియమించిన ఆరుగురు సలహాదారులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్. విద్యాసాగర్‌రావు(సాగునీటి పారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన శాఖ), కేవీ రమణాచారి(దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక, యువజన, మీడియా), బీవీ పాపారావు(సంస్థాగత వ్యవహారాలు), ఎ.రామలక్ష్మణ్(సంక్షేమం), జీఆర్ రెడ్డికి ఆర్థికశాఖను కేటాయించారు.