హైదరాబాద్ : హెచ్సీయూ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు శనివారం వర్సిటీలోకి రావటానికి ప్రయత్నించారు. కానీ ప్రధాన గేటు వద్ద వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తమను లోపలికి అనుమతించాల్సిందేనని రాధిక వాదించారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా అక్కడ మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాగా హెచ్సీయూ వద్ద పీడీఎస్‌యూ విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. వీసీ అప్పారావును వెంటనే అరెస్టు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో హెచ్‌సీయూ భద్రతా సిబ్బందికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
హెచ్సీయూ లో మళ్లీ ఉద్రిక్తత
Published Sat, Mar 26 2016 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM
Advertisement
Advertisement