నీటి కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్ | petition on water distribution to liquor and cool drink companies in telangana | Sakshi
Sakshi News home page

నీటి కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్

Published Thu, May 5 2016 1:23 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

petition on water distribution to liquor and cool drink companies in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే...ప్రభుత్వం మద్యం, కూల్డ్రింక్ కంపెనీలకు భారీగా నీళ్లు ఇస్తోందని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అన్నారు.

కంపెనీలకు తాగునీటి కేటాయింపులపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ తరపున రవిశంకర్ వాదనలు వినిపించారు. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోందన్నారు. 1512 మిలియన్ లీటర్ల నీటిని బీరు, కూల్ డ్రింక్ కంపెనీలకు ఇస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ తీరు..ప్రజలను తీవ్ర ఇక్కట్లుకు గురిచేస్తోందని రవిశంకర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement