ఫోన్ ట్యాపింగ్ కేసులో టీ.సర్కార్కు ఊరట
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో సర్వీస్ ప్రొవైడర్లు ట్యాపింగ్ కాల్‌డాటా ఇవ్వాలని పోలీసులు కోరడంతో మరోసారి తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మొబైల్ సర్వీస్ కంపెనీల్లో ఇంప్లీడ్ కాని టాటా, వొడాఫోన్‌కు సైతం గత హైకోర్టు ఆదేశాలు వర్తించేలా స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.
తెలంగాణ ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం సర్వీస్ ప్రొవైడర్లు సీల్డ్ కవర్‌లో దాఖలు చేసిన నివేదికను హైకోర్టు శుక్రవారం రిజస్ట్రార్‌కు అందచేయ్యాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో విజయవాడ కోర్టుకు మొబైల్ సర్వీస్ కంపెనీలు ఇచ్చిన డాటా ఓపెన్ చేయకుండానే హైకోర్టుకు చేరనుంది. ఇక ఈ నెల చివరివారంలో విచారకు వచ్చే ఫోన్‌ట్యాపింగ్ కేసు వ్యవహారంపై హైకోర్టు ఆదేశాల మేరకే విచారణ సాగనుంది.