► భారీగా కల్తీ పదార్ధాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: మీర్‌పేట్‌లో కల్తీ పాలు, పెరుగు తయారు చేస్తున్న డైరీఫామ్స్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మీర్ పేట్ పీస్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గురు దర్శన్ డైరీఫామ్ నిర్వహిస్తున్న సత్యనారాయణ కల్తీ పెరుగు తయారు చేస్తున్నాడనే సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు అతని డైరీ ఫామ్‌పై దాడి చేసి కల్తీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గురుదర్శన్ డైరీఫాంలో 8కేజీల పాలపొడి, 12 బ్యాగుల గీక్రీమ్, ప్యాకింగ్ మెషిన్, వెయింగ్ మెషిన్, ఒమిని వ్యాన్, బిల్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అదేవిధంగా మరో కాలనీ చైతన్య హిల్స్‌లో లింగ మూర్తి, కుమార్ అనే ఇద్దరు గుట్టు చప్పుడు కాకుండా శ్రీధార డైరీఫామ్ పేరుతో కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డైరీఫామ్‌పై దాడుల నిర్వహించి కల్తీ పాల పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డైరీఫాంలో 8 కేజీల మిల్క్ పొడి, 800 లీటర్ల లూజ్ మిల్క్, 92 ప్యాక్ చేసిన పాల ప్యాకెట్లు, 18 లీటర్ల లేబుల్ లేని మిల్క్ స్వాధీనం చేసుకుని నిర్వహకులపై కేసు నమోదు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు, వాటిని మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
డైరీఫాంలపై దాడులు..
Published Wed, Jun 7 2017 3:55 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement