పొత్తు కోసం టీఆర్ఎస్ వస్తే పరిశీలిస్తాం: పొన్నాల
టీఆర్ఎస్ పార్టీ నుంచి పొత్తు ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విలేకర్లతో మాట్లాడారు.అయితే ప్రస్తుతం సీపీఐ పార్టీతో పొత్తుపై చర్చలు జరగుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో ఓ ఎంపీ,8 అసెంబ్లీ స్థానాలు సీపీఐకి ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పొన్నాల వెల్లడించారు.పొత్తులపై చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందన్నారు.తమ పార్టీ అధిష్టానంతో ఆ అంశంపై చర్చలు జరుగుతున్నాయని,త్వరలో ఆ ప్రక్రియ తుది రూపం దాలుస్తుందని పొన్నాల లక్ష్మయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.