'ద్వారాలు మూసుకుపోయినా సంతోషకరమే'
న్యూఢిల్లీ : పొత్తులపై టీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయినా అది సంతోషకరమేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలకు తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ శనివారం సమావేశమైంది. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో మరోసారి సమావేశమై ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. తెలంగాణలో సీపీఐతో పొత్తులో ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.