'100 ఎమ్మెల్యే,15 ఎంపీ సీట్లు మావే'
వచ్చే ఎన్నికలలో తెలంగాణలో 100 అసెంబ్లీ, 15 లోక్సభ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్లో పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ నుంచి పొత్తు ప్రతిపాదనలు ఏవి తమకు రాలేదని తెలిపారు. పొత్తులకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయన్నారు.
ఉద్యోగుల ఆప్షన్లు, పోలవరం ముంపు మండలాలపై కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ చేసే ప్రకటనలపై ఓ సారి ఆలోచించాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కేసీఆర్ ప్రకటనల వల్ల ఎవరికి ఉపయోగమో తెలుసుకోవాలని పొన్నాల ఈ సందర్భంగా సూచించారు.