ఆధిపత్య పోరులో భాగంగా మాపై విమర్శలు: హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ జోరందుకున్న ఆధిపత్య పోరులో భాగంగానే పొన్నాల టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అనవసరంగా తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.
60 రోజుల్లోనే 43 నిర్ణయాలు తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని ఆయన అన్నారు. ఆర్బీఐతో చిక్కులు ఉన్నా రుణమాఫీ చేస్తామని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూనే కొత్త ఉద్యోగాలిస్తామని ఆయన ఓ ప్రశ్న సమాధానమిచ్చారు.
తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడని కిషన్‌రెడ్డి ఇప్పుడు ఉనికి కోసం మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు.