రాజకీయాలంటే పదవులు కాదు.. ప్రజాసేవ: పొన్నాల
న్యూఢిల్లీ: టీఆర్ఎస్లో చేరడాన్ని పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. రాజకీయాలంటే పదవులుకాదు ప్రజలకు సేవ అని పొన్నాల వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ కంటే ముందే తెలంగాణ ఉద్యమం చేపట్టామని.. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా క్రెడిట్ దక్కలేదని పొన్నాల అన్నారు. ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేయడం మానుకోవాలని, టీఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలని పొన్నాల విజ్క్షప్తి చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరినీ కలుపుకు పోయేందుకు టీఆర్ఎస్ చొరవ తీసుకోవాలని పొన్నాల తెలిపారు.