భానుమూర్తి ఆరోపణలపై గంగు ఉపేంద్రశర్మ స్పందన
కాచిగూడ: మతైక ఉద్యోగుల సంఘం నేత గంగు భానుమూర్తిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. బర్కత్‌పురలోని అర్చక భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై భానుమూర్తి తన అనుచరులతో చేయించిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తనపై సీబీఐ విచారణ కూడా జరిపించుకోవచ్చని అన్నారు. సీబీఐ విచారణకు భానుమూర్తి సిద్ధమా అని ప్రశ్నించారు. ఐదువేల మంది అర్చకులకు ట్రెజరీ వేతనాలు వస్తాయని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ.5 వేల చొప్పున వసూళ్లకు శ్రీకారం చుట్టిన గంగు భానుమూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ప్రతినిధులు భాస్కరభట్ల రామశర్మ, రాజేశ్వరశర్మ, తెలంగాణ మతైక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ శర్మ, చిరంజీవి శర్మ, సంతోష్ శర్మ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.మోహన్ మాట్లాడుతూ ఉపేంద్రశర్మపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య తమదేనని, అర్చక సమాఖ్య పేరుతో ఏవరైనా ఇక నుంచి ప్రకటనలు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీబీఐ విచారణకు సిద్ధం
Published Thu, Jul 2 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement