ప్రైవేట్ వైద్యుల మరో ఘరానా మోసం! | private doctors froad | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ వైద్యుల మరో ఘరానా మోసం!

Published Mon, Mar 2 2015 9:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

private doctors froad

హైదరాబాద్: ప్రైవేట్ వైద్యుల ఘరానా మోసాలు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అనారోగ్యం కారణంగా  ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు మోసపోయిన ఘటన నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ జంట వద్ద ఆరోగ్య సమస్యలతో ఎల్బీ నగర్ లోని ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మాయ మాటలు చెప్పారు.

 

దీనిలో భాగంగానే వారి వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే దీనిపై మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన డాక్టర్లు రాంజీ, నాగభూషణంలుగా తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement