
ప్యూర్ లెదర్
ఇవి అచ్చంగా తోలుబొమ్మలేనండోయ్..! అలాగని.. నాలుగు దిక్కుల నడిమి సంతలో.. నాట్యం చేసే బొమ్మలు కావు. ప్యూర్ లెదర్‌తో రూపొందించిన అందమైన బొమ్మలు. చల్ చల్‌మనే చలాకి గుర్రాలు.. తెల్లని కొమ్ముల నల్లని ఏనుగులు.. చెంగు చెంగున దూకే హరిణాలు.. ఇలా ఎన్నో బొమ్మలు కుత్బుల్లాపూర్ సుచిత్ర రహదారిలో క నువిందు చేస్తున్నాయి.
జీవకళ ఉట్టిపడుతున్న ఈ బొమ్మలను చూడగానే ఆ దారిన వెళ్తున్న బాటసారులు కన్నార్పకుండా చూడటమే కాదు.. కాసులు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలైతే.. తల్లిదండ్రులను సతాయించి మరీ వాటిని సాధిస్తున్నారు. రూ.150 నుంచి రూ.350 వరకూ పలుకుతున్న ఈ బొమ్మలు కింద పడ్డా పగలకపోవడం వీటి అదనపు ఆకర్షణ.