
ఊరు పిలిచింది
అనుభూతుల సరాగం, ఆత్మీయ అనుబంధం, ఆహ్లాద వాతావరణం..
అనుభూతుల సరాగం, ఆత్మీయ అనుబంధం, ఆహ్లాద వాతావరణం.. ఆస్వాదించేందుకు పట్నం పల్లె బాట పట్టింది. ఉన్న ఊరిని, కన్న వారిని కలిసేందుకు కోటి ఆశలతో పల్లెతల్లి లోగిళ్లకు చేరుతోంది.
సంక్రాంతి పండగ సందర్భంగా సిటీజనులు గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రద్దీ ఎక్కువ ఉండడంతో తోపులాట జరిగింది. – అడ్డగుట్ట